లేఖనాలను అన్వేషించండి

1కొరిందీయులకు 11: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునైయున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయైయున్నది."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 5:18

తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తలముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను.

ద్వితియోపదేశాకాండము 22:5

స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.

ఆదికాండము 24:65

మనలనెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.

ద్వితియోపదేశాకాండము 21:12

నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని

1కొరిందీయులకు 14:35

వారు ఏమైనను నేర్చుకొనగోరినయెడల, ఇంట తమ తమ భర్తలనడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము.