లేఖనాలను అన్వేషించండి

1కొరిందీయులకు 3: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" అపొల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి"

సంబంధిత రిఫరెన్స్‌లు

1కొరిందీయులకు 1:12

మీలో ఒకడు నేను పౌలువాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము.

1కొరిందీయులకు 4:6

సహోదరులారా, మీరు మమ్మును చూచి, లేఖనములయందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరియొకనిమీద ఉప్పొంగకుండునట్లు, ఈ మాటలు మీ నిమిత్తమై నామీదను అపొల్లోమీదను పెట్టుకొని సాదృశ్యరూపముగా చెప్పియున్నాను.

అపోస్తలులకార్యములు 19:1

అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారినడుగగా

1కొరిందీయులకు 3:1

సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను.

1కొరిందీయులకు 3:21

కాబట్టి యెవడును మనుష్యులయందు అతిశయింపకూడదు; సమస్తమును మీవి.

2కొరిందీయులకు 12:11

నేనవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువవాడను కాను.

2కొరిందీయులకు 12:20

ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు, నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములును కక్షలును కొండెములును గుసగుసలాడుటలును ఉప్పొంగుటలును అల్లరులును ఉండునేమో అనియు,

ఫిలిప్పీయులకు 1:15

కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధిచేతను క్రీస్తును ప్రకటించుచున్నారు.