లేఖనాలను అన్వేషించండి

1దెస్సలోనీకయులకు 4: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును."

సంబంధిత రిఫరెన్స్‌లు

రోమీయులకు 1:13

సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలోకూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నాకిష్టములేదు

1కొరిందీయులకు 10:1

సహోదరులారా, యీ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టములేదు. అదేదనగా, మన పితరులందరు మేఘముక్రింద నుండిరి. వారందరును సముద్రములో నడచిపోయిరి;

1కొరిందీయులకు 12:1

మరియు సహోదరులారా, ఆత్మసంబంధమైన వరములనుగూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు.

2కొరిందీయులకు 1:8

సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు.

2పేతురు 3:8

ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరములవలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినమువలెను ఉన్నవి.

1దెస్సలోనీకయులకు 4:15

మేము ప్రభువు మాటనుబట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించినవారికంటె ముందుగా ఆయన సన్నిధి చేరము.

1దెస్సలోనీకయులకు 5:10

మనము మేలుకొనియున్నను నిద్రపోవుచున్నను తనతోకూడ జీవించు నిమిత్తము ఆయన మనకొరకు మృతిపొందెను.

1రాజులు 1:21

ఇదిగాక నా యేలినవాడవైన రాజవగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము.

1రాజులు 2:10

తరువాత దావీదు తన పితరులతో కూడ నిద్రపొంది, దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను.

దానియేలు 12:2

మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

మత్తయి 27:52

సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేకమంది పరిశుద్ధుల శరీరములు లేచెను.

లూకా 8:52

ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చప్పెను.

లూకా 8:53

ఆమె చనిపోయెనని వారెరిగి ఆయనను అపహసించిరి.

యోహాను 11:11

ఆయన యీ మాటలు చెప్పిన తరువాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా

యోహాను 11:12

శిష్యులు ప్రభువా, అతడు నిద్రించినయెడల బాగుపడుననిరి.

యోహాను 11:13

యేసు అతని మరణమునుగూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతినిగూర్చి చెప్పెననుకొనిరి.

అపోస్తలులకార్యములు 7:60

అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

అపోస్తలులకార్యములు 13:36

దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి,

1కొరిందీయులకు 15:6

అటుపిమ్మట ఐదువందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటివరకు నిలిచియున్నారు, కొందరు నిద్రించిరి.

1కొరిందీయులకు 15:18

అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి.

2పేతురు 3:4

ఆయన రాకడనుగూర్చిన వాగ్దానమేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభముననున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలిసికొనవలెను

ఆదికాండము 37:35

అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారునియొద్దకు వెళ్లేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను

లేవీయకాండము 19:28

చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.

ద్వితియోపదేశాకాండము 14:1

మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక చనిపోయిన వాడెవనినిబట్టి మిమ్మును మీరు కోసికొనకూడదు, మీ కనుబొమ్మల మధ్య బోడిచేసికొనకూడదు.

ద్వితియోపదేశాకాండము 14:2

ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్టిత జనము. మరియు యెహోవా భూమిమీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.

2సమూయేలు 12:19

ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయెనను సంగతి గ్రహించి బిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారు చనిపోయెననిరి.

2సమూయేలు 12:20

అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానము చేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగివచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను.

2సమూయేలు 18:33

అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కిపోయి యేడ్చుచు, సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.

యోబు 1:21

నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగివెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

యెహెజ్కేలు 24:16

నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీయొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయబోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.

యెహెజ్కేలు 24:17

మృతులకై విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొనవద్దు జనుల ఆహారము భుజింపవద్దు

యెహెజ్కేలు 24:18

ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంతనమున నా భార్య చనిపోగా ఆయన నా కాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని.

యోహాను 11:24

మార్త ఆయనతో అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను.

అపోస్తలులకార్యములు 8:2

భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనినిగూర్చి బహుగా ప్రలాపించిరి.

ఎఫెసీయులకు 2:12

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాననిబంధనలు లేని పరజనులును, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై యుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

యోబు 19:25

అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమిమీద నిలుచుననియు నేనెరుగుదును.

యోబు 19:26

ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను.

యోబు 19:27

నామట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు నేనే కన్నులార ఆయనను చూచెదను నాలో నా అంతరింద్రియములు కృశించియున్నవి

సామెతలు 14:32

అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.

యెహెజ్కేలు 37:11

అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారుమన యెముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతివిు అని యనుకొనుచున్నారు

1కొరిందీయులకు 15:19

ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరికంటె దౌర్భాగ్యులమై యుందుము.

ఆదికాండము 24:67

ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొనిపోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.

ఆదికాండము 44:31

అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొనియున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము

ఆదికాండము 50:1

యోసేపు తన తండ్రి ముఖముమీద పడి అతనిగూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.

లేవీయకాండము 21:2

యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్తసంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు,

లేవీయకాండము 25:28

అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకనియెడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరమువరకు కొనినవాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.

కీర్తనలు 4:8

యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.

కీర్తనలు 16:9

అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది

సామెతలు 3:24

పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.

యెహెజ్కేలు 44:25

తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లికాని సహోదరిదియు శవమునుముట్టి అంటుపడవచ్చును, అయితే మరి ఏ మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడకూడదు.

మార్కు 5:39

లోపలికిపోయి మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను.

లూకా 7:13

ప్రభువు ఆమెను చూచి ఆమెయందు కనికరపడి--ఏడువవద్దని ఆమెతో చెప్పి, దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి.

లూకా 20:36

వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.

అపోస్తలులకార్యములు 4:2

వారు ప్రజలకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి

అపోస్తలులకార్యములు 9:39

పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొని వచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.

అపోస్తలులకార్యములు 27:20

కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగ పోయెను.

2కొరిందీయులకు 2:7

గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.

ఫిలిప్పీయులకు 1:21

నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.

1దెస్సలోనీకయులకు 4:14

యేసు మృతిపొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును.

1పేతురు 1:3

మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడును గాక.