లేఖనాలను అన్వేషించండి

1తిమోతి 5: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" బాగుగా పాలనచేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడువారిని, రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

1తిమోతి 5:4

అయితే ఏ విధవరాలికైనను పిల్లలు గాని మనుమలు గాని యుండినయెడల, వీరు మొదట తమ యింటివారియెడల భక్తి కనుపరచుటకును, తమ తలిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను; ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది.

1తిమోతి 5:8

ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపక పోయినయెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును.

1తిమోతి 5:3

నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము.

1తిమోతి 5:5

అయితే నిజముగా అనాథయైన విధవరాలు ఏకాకియై యుండి, దేవుని మీదనే తన నిరీక్షణనుంచుకొని, విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలుకడగా ఉండును.

మత్తయి 15:6

మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.