లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 15: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండపోవును."

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 12:28

ఆలోచనచేసి రెండు బంగారపు దూడలు చేయించి, జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము;

1రాజులు 12:29

ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, ఒకటి బేతేలునందును, ఒకటి దానునందును ఉంచెను.

1రాజులు 12:30

దానువరకు ఈ రెంటిలో ఒకదానిని జనులు పూజించుటవలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను.

1రాజులు 12:31

మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.

1రాజులు 12:32

మరియు యరొబాము యూదాదేశమందు జరుగు ఉత్సవమువంటి ఉత్సవమును ఎనిమిదవ మాసము పదునైదవ దినమందు జరుప నిర్ణయించి, బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన యున్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను.

1రాజులు 12:33

ఈ ప్రకారము అతడు యోచించిన దానినిబట్టి యెనిమిదవ మాసము పదునైదవ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠముమీద బలులు అర్పించుచు వచ్చెను; మరియు ఇశ్రాయేలువారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను.

హోషేయ 3:4

నిశ్చయముగా ఇశ్రాయేలీయులు చాల దినములు రాజు లేకయు అధిపతి లేకయు బలినర్పింపకయు నుందురు. దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని యుంచుకొనకుందురు.

యిర్మియా 10:10

యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

యోహాను 17:3

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.

1దెస్సలోనీకయులకు 1:9

మీయొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో, అక్కడి జనులు మమ్మునుగూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి, జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును,

1యోహాను 5:20

మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునైయున్నాడు.

2దినవృత్తాంతములు 17:8

షెమయా నెతన్యా జెబద్యా అశాహేలు షెమిరామోతు యెహోనాతాను అదోనీయా టోబీయా టోబదోనీయా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను యెహోరామును బంపెను.

2దినవృత్తాంతములు 17:9

వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేతపుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటన చేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.

లేవీయకాండము 10:11

యెహోవా మోషేచేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

ద్వితియోపదేశాకాండము 33:10

వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు

నెహెమ్యా 8:9

జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.

యెహెజ్కేలు 44:21

లోపటి ఆవరణములో చొచ్చునపుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానము చేయకూడదు.

యెహెజ్కేలు 44:22

వారు విధవరాండ్రనైనను విడువబడినదానినైనను పెండ్లిచేసికొనకూడదుగాని ఇశ్రాయేలీయుల సంతతివారగు కన్యలనైనను, యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్నవారినైనను చేసికొనవచ్చును.

యెహెజ్కేలు 44:23

ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు

మీకా 3:11

జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.

మలాకీ 2:7

యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను.

మత్తయి 2:4

కాబట్టి రాజు ప్రధానయాజకులను ప్రజలలోనుండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారినడిగెను.

మత్తయి 2:5

అందుకు వారు యూదయ బేత్లెహేములోనే; ఏలయనగా యూదయ దేశపు బేత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైనదానవు కావు;ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలోనుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి యున్నదనిరి

1తిమోతి 3:2

అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునై యుండి,

రోమీయులకు 2:12

ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.

రోమీయులకు 7:8

అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకలవిధమైన దురాశలను నాయందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము.

రోమీయులకు 7:9

ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.

1కొరిందీయులకు 9:21

దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కానుగాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలెఉంటిని.

2దినవృత్తాంతములు 17:7

తన యేలుబడియందు మూడవ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును ఓబద్యాను జెకర్యాను నెతనేలును మీకాయాను

2దినవృత్తాంతములు 30:22

యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమ పితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.

విలాపవాక్యములు 2:9

పట్టణపు గవునులు భూమిలోనికి క్రుంగిపోయెను దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడుచేసెను దాని రాజును అధికారులును అన్యజనులలోనికి పోయియున్నారు అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు.

హోషేయ 4:6

నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును; నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.

ఎఫెసీయులకు 2:12

ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాననిబంధనలు లేని పరజనులును, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై యుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

ఎఫెసీయులకు 4:11

మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారునిగూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వముపొంది సంపూర్ణ పురుషులమగువరకు,