లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 19: 1

క్రాస్-రిఫరెన్స్‌లు

" యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయమును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

2దినవృత్తాంతములు 18:31

కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి, గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతనియొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను.

2దినవృత్తాంతములు 18:32

ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి.

2దినవృత్తాంతములు 18:1

తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది

2దినవృత్తాంతములు 28:9

యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెను ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీచేతికి అప్పగించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.