లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 22: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆరు సంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిరములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 27:5

ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.

కీర్తనలు 12:8

నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్టులై నలుదిక్కుల తిరుగులాడుదురు.

కీర్తనలు 73:14

దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.

కీర్తనలు 73:18

నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు

కీర్తనలు 73:19

క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.

యిర్మియా 12:1

యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?

హబక్కూకు 1:12

యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణము నొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయదుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.

2రాజులు 11:3

అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడ దాచబడియుండెను.