లేఖనాలను అన్వేషించండి

2దినవృత్తాంతములు 26: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్షతోట పనివారును కలిగియుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 26:18

అప్పుడు తన తండ్రియైన అబ్రాహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను; ఏలయనగా అబ్రాహాము మృతిబొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్ళు పెట్టెను

ఆదికాండము 26:19

మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జెలలుగల నీళ్లబావి దొరికెను.

ఆదికాండము 26:20

అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు అను పేరు పెట్టెను.

ఆదికాండము 26:21

వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.

2రాజులు 3:4

మోయాబు రాజైన మేషా అనేకమైన మందలు గలవాడై లక్ష గొఱ్ఱపిల్లలను బొచ్చుగల లక్ష గొఱ్ఱపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు.

1దినవృత్తాంతములు 27:26

పొలములో పనిచేయువారిమీదను, భూమిదున్ను వారిమీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను.

1దినవృత్తాంతములు 27:27

ద్రాక్షతోటలమీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షారసము నిలువచేయు కొట్లమీద షిష్మీయుడైన జబ్దియు నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 27:28

షెఫేలా ప్రదేశముననుండు ఒలీవ చెట్లమీదను మేడిచెట్లమీదను గెదేరీయుడైన బయల్‌ హనాను నియమింపబడెను; నూనె కొట్లమీద యోవాషు నియమింపబడెను.

1దినవృత్తాంతములు 27:29

షారోనులో మేయు పశువులమీద షారోనీయుడైన షిట్రయియు, లోయలలోని పశువులమీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 27:30

ఒంటెలమీద ఇష్మాయేలీయుడైన ఓబీలును, గాడిదలమీద మేరోనోతీయుడైన యెహెద్యాహును నియమింపబడిరి.

1దినవృత్తాంతములు 27:31

గొఱ్ఱలమీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరు దావీదు రాజుకున్న ఆస్తిమీద నియమింపబడిన యధిపతులు.

2రాజులు 19:23

ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా.నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసియున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను.

యెషయా 29:17

ఇకను కొద్ది కాలమైన తరువాతనే గదా లెబానోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని యెంచబడును.

ఆదికాండము 47:6

ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింపవచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచినయెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను

యెహోషువ 15:55

మాయోను కర్మెలు జీఫు యుట్టయెజ్రెయేలు

1సమూయేలు 8:11

ఈలాగున చెప్పెను మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరగెత్తుదురు.

1సమూయేలు 21:7

ఆ దినమున సౌలుయొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పసులకాపరులకు పెద్ద

2సమూయేలు 13:23

రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.

2రాజులు 18:8

మరియు గాజా పట్టణమువరకు దాని సరిహద్దులవరకు కాపరుల గుడిసెలయందేమి, ప్రాకారములుగల పట్టణములయందేమి, అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను.

1దినవృత్తాంతములు 27:25

రాజు బొక్కసములమీద అదీయేలు కుమారుడైన అజ్మావెతు నియమింపబడెను; అయితే పొలములలోను పట్టణములలోను గ్రామములలోను దుర్గములలోను ఉండు ఆస్తిమీద ఉజ్జియా కుమారుడైన యెహోనాతాను నియమింపబడెను.

2దినవృత్తాంతములు 17:13

యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతనిక్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.

2దినవృత్తాంతములు 26:15

మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.

2దినవృత్తాంతములు 27:4

మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.

2దినవృత్తాంతములు 32:28

ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.

2దినవృత్తాంతములు 32:29

మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱలమందలను పసులమందలను అతడు సంపాదించెను.

యోబు 1:3

అతనికి ఏడువేల గొఱ్ఱలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.

సామెతలు 27:23

నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసికొనుము నీ మందలయందు మనస్సు ఉంచుము.

ప్రసంగి 2:4

నేను గొప్ప పనులు చేయ బూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని.

ప్రసంగి 2:7

పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱ మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని.

హోషేయ 8:14

ఇశ్రాయేలువారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు; యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును.