2దినవృత్తాంతములు 28: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" పరాక్రమశాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభా ముఖ్యుడైన అజ్రీకామును ప్రధాన మంత్రియైన ఎల్కొనానును హతము చేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.
రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడచేత పట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;
ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని,చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.
యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.