2దినవృత్తాంతములు 32: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము షెబ్నాయు యోవాహు అనువారు చిత్తగించుము, నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియును గనుక దానితో మాటలాడుము; ప్రాకారముమీద నున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడకుమని రబ్షాకేతో అనగా
రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమానుని యొద్దకును నీయొద్దకును నన్ను పంపెనా? తమ మలమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతోకూడ ప్రాకారముమీద కూర్చున్నవారియొద్దకును నన్ను పంపెనుగదా అని చెప్పి
గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా
గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చునదేమనగా
ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన యెడల వాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.
దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించినవానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారినడుగగా
నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారము కాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నాచేతులను బలపరచుము.
గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా