లేఖనాలను అన్వేషించండి

2రాజులు 18: 36

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుటచేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 38:13

చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.

కీర్తనలు 38:14

నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.

కీర్తనలు 39:1

నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ననుకొంటిని.

సామెతలు 9:7

అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.

సామెతలు 26:4

వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.

ఆమోసు 5:13

ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.

మత్తయి 7:6

పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును.

సామెతలు 11:12

తన పొరుగువానిని తృణీకరించువాడు బుద్ధిలేనివాడు. వివేకియైనవాడు మౌనముగా నుండును.