2రాజులు 24: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" బబులోనురాజు ఐగుప్తు నదికిని యూఫ్రటీసు నదికిని మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమియంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇకనెన్నటికిని తన దేశము విడిచి బయలుదేరుట మానెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.
అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా నాయొద్ద విచారించుడని నిన్ను నాయొద్దకు పంపిన యూదా రాజుతో నీవీలాగు చెప్పవలెను మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చుచున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగివెళ్లును.
ఐగుప్తునుగూర్చిన మాట, అనగా యోషీయా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున నెబుకద్రెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నదిదగ్గర ఓడించిన ఫరోనెకో దండునుగూర్చిన మాట.
ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా
అస్మోనునుండి ఐగుప్తు నదివరకు సరిహద్దు తిరిగి సముద్రమువరకు వ్యాపించును.
అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆ తట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరి హద్దు.
నది (యూఫ్రటీసు) మొదలుకొని ఐగుప్తు సరిహద్దువరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటిమీదను ఫిలిష్తీయుల దేశమంతటిమీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలొమోను బ్రదికిన దినములన్నియు అతనికి సేవచేయుచు వచ్చిరి.
ఆ దినమున యూఫ్రటీసు నదీప్రవాహము మొదలుకొని ఐగుప్తు నదివరకు యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇశ్రాయేలీయులారా, మీరు ఒకరినొకరు కలిసికొని కూర్చబడుదురు.
అతని దినములయందు ఐగుప్తురాజైన ఫరోనెకో అష్షూరు రాజుతో యుద్ధము చేయుటకై యూఫ్రటీసునది దగ్గరకు వెళ్లుచుండగా తన్ను ఎదుర్కొనవచ్చిన రాజైన యోషీయాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను.
వారి పశువులు గిలాదు దేశమందు అతివిస్తారము కాగా తూర్పున యూఫ్రటీసు నది మొదలుకొని అరణ్యపు సరిహద్దువరకును వారు కాపురముండిరి.
నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము.
ఇది ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవాకు పగతీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును ఖడ్గము కడుపార తినును, అది తనివితీర రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నదియొద్ద ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు.
వ్యర్థసహాయముకొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేము కనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురుచూచుచుంటిమి.
నేను ఐగుప్తు రాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్నదానిని విరిగిపోయిన దానిని అతని రెండుచేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.