లేఖనాలను అన్వేషించండి

2రాజులు 8: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటినిగూర్చియు భూమినిగూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 8:6

రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను.

2రాజులు 4:13

అతడు నీవు ఇంత శ్రద్ధా భక్తులు మాయందు కనుపరచితివి నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్నుగూర్చి నేను మాటలాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహజీకి ఆజ్ఞ ఇయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె నేను నా స్వజనులలో కాపురమున్నాననెను.

2రాజులు 6:26

అంతట ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారముమీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజవైన నా యేలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయుట విని

2సమూయేలు 14:4

కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసి రాజా రక్షించుమనగా

కీర్తనలు 82:3

పేదలకును తలిదండ్రులు లేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి.

కీర్తనలు 82:4

దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలోనుండి వారిని తప్పించుడి.

యిర్మియా 22:16

అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.

లూకా 18:3

ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని

లూకా 18:4

అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను

లూకా 18:5

ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.

ఆదికాండము 42:1

ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.

2సమూయేలు 19:28

నా తండ్రి యింటివారందరు నా యేలినవాడవును రాజవునగు నీ దృష్టికి మృతులవంటివారై యుండగా, నీవు నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజవైన నీకు మొఱ్ఱపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా

కీర్తనలు 107:39

వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు