లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 12: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" పట్టణములో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపములచేతను పదునుగల యినుప పనిముట్లచేతను ఇనుప గొడ్డండ్లచేతను వారిని తుత్తునియలుగా చేయించి వారిని ఇటుక ఆవములో వేసెను. అమ్మోనీయుల పట్టణములన్నిటికి అతడు ఈలాగు చేసెను. ఆ తరువాత దావీదును జనులందరును తిరిగి యెరూషలేమునకు వచ్చిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

1దినవృత్తాంతములు 20:3

దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

2సమూయేలు 8:2

మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

కీర్తనలు 21:8

నీ హస్తము నీ శత్రువులందరిని చిక్కించుకొనును నీ దక్షిణహస్తము నిన్ను ద్వేషించువారిని చిక్కించుకొనును.

కీర్తనలు 21:9

నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండమువలె అగుదురు తన కోపమువలన యెహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును.

ఆమోసు 1:3

యెహోవా సెలవిచ్చునదేమనగా దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.

ఆదికాండము 11:3

మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.

ద్వితియోపదేశాకాండము 23:6

నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.

1సమూయేలు 14:44

అందుకు సౌలు యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొననియెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.

2దినవృత్తాంతములు 16:10

ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.

2దినవృత్తాంతములు 25:12

ప్రాణముతోనున్న మరి పదివేలమందిని యూదావారు చెరపట్టుకొని, వారిని ఒక పేటుమీదికి తీసికొనిపోయి ఆ పేటుమీదనుండి వారిని పడవేయగా వారు తుత్తునియలైపోయిరి.

సామెతలు 20:26

జ్ఞానముగల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారిమీద చక్రము దొర్లించును.

యిర్మియా 43:9

నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము