2సమూయేలు 2: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక."
సంబంధిత రిఫరెన్స్‌లు
సౌలు వారితో ఇట్లనెను మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగును గాక.
ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలుచేయును గాక.
అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.
నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.
భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.
అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు,
మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచా రింపగా
వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.
కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారియొద్దనుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబేష్గిలాదు వారు వారి యెముకలను అచ్చటనుండి దొంగిలి తెచ్చియుండిరి.
వారి న్యాయాధిపతులు కొండ పేటుమీదనుండి పడద్రోయబడుదురు. కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు.