లేఖనాలను అన్వేషించండి

కొలొస్సయులకు 4: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" నాతో కూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు; ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి."

సంబంధిత రిఫరెన్స్‌లు

కొలొస్సయులకు 4:7

ప్రియ సహోదరుడును, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోడి సేవకుడునైన తుకికు నన్నుగూర్చిన సంగతులన్నియు మీకు తెలియజేయును.

ఫిలేమోనుకు 1:10

నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను.

ఫిలేమోనుకు 1:11

అతడు మునుపు నీకు నిష్‌ప్రయోజనమైనవాడే గాని, యిప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను.

ఫిలేమోనుకు 1:12

నా ప్రాణము వంటివాడైన అతనిని నీయొద్దకు తిరిగి పంపియున్నాను.

ఫిలేమోనుకు 1:13

నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని

ఫిలేమోనుకు 1:14

నీ ఉపకారము బలవంతముచేత నైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని, నీ సమ్మతిలేక యేమియు చేయుటకు నాకిష్టములేదు.

ఫిలేమోనుకు 1:15

అతడికమీదట దాసుడుగా ఉండక దాసునికంటె ఎక్కువవాడుగాను, ప్రియ సహోదరుడు

ఫిలేమోనుకు 1:16

గాను, విశేషముగా నాకును, శరీరవిషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును, ప్రియ సహోదరుడుగాను, నీయొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్దికాలము నిన్ను ఎడబాసి యుండెను.

ఫిలేమోనుకు 1:17

కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినయెడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొనుము.

ఫిలేమోనుకు 1:18

అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసినయెడలను, నీకు ఏమైన ఋణమున్నయెడలను, అది నా లెక్కలో చేర్చుము;

ఫిలేమోనుకు 1:19

పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు ఋణపడియున్నావని నేను చెప్పనేల?

అపోస్తలులకార్యములు 15:25

గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మునుతాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను

1కొరిందీయులకు 4:17

ఇందునిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడునగు తిమోతిని మీయొద్దకు పంపియున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును, మీకు జ్ఞాపకము చేయును.

ఎఫెసీయులకు 6:21

మీరును నా క్షేమ సమాచారమంతయు తెలిసికొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నియు మీకు తెలియజేయును.

ఫిలిప్పీయులకు 2:19

నేనును మీ క్షేమము తెలిసికొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీయొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను.

1దెస్సలోనీకయులకు 3:2

యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితివిు. మేము మీయొద్ద ఉన్నప్పుడు,

1పేతురు 5:12

మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి.