ద్వితియోపదేశాకాండము 11: 30
క్రాస్-రిఫరెన్స్‌లు
" అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా."
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.
అప్పుడు యెహోవానేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండ దొరలించివేసి యున్నానని యెహో షువతో ననెను. అందుచేత నేటివరకు ఆ చోటికి గిల్గాలను పేరు.
అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితో నున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యా నీయుల దండుపాళెము వారికి కనబడెను.
ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖమని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.
మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీకాజ్ఞాపించినట్లు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.
మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకా రము
మరియు గిల్గాలు యొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతు యొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొనియుండిరి.
యెముకలనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి.