లేఖనాలను అన్వేషించండి

ప్రసంగి 5: 13

క్రాస్-రిఫరెన్స్‌లు

" సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా ఆస్తిగలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 4:8

యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.

కీర్తనలు 127:2

మీరు వేకువనే లేచి చాల రాత్రియైన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు.

సామెతలు 3:24

పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.

యిర్మియా 31:26

అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయెను.

ఆదికాండము 48:15

అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,

న్యాయాధిపతులు 19:16

ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాల మున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు.

కీర్తనలు 104:23

సాయంకాలమువరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుష్యులు బయలువెళ్లుదురు.

ప్రసంగి 2:23

వాని దినములన్నియు శ్రమకరములు, వాని పాట్లు వ్యసనకరములు, రాత్రియందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు; ఇదియు వ్యర్థమే.

ప్రసంగి 8:16

జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండ మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా