లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 19: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసికొనిపోయి అతనికి అప్పగించిరి; దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతములమీద ఎన్నటికిని వినబడకుండునట్లు వారు దానిని గట్టి స్థలమందుంచిరి. "

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 24:1

యెహోయాకీము దినములలో బబులోనురాజైన నెబుకద్నెజరు యెరూషలేముమీదికి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై మూడేండ్ల సేవ చేసిన తరువాత అతనిమీద తిరుగుబాటుచేయగా

2రాజులు 24:2

యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.

2రాజులు 24:3

మనష్షే చేసిన క్రియలన్నిటినిబట్టియు, అతడు నిరపరాధులను హతముచేయుటనుబట్టియు, యూదావారు యెహోవా సముఖమునుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞవలన ఇది వారిమీదికి వచ్చెను.

2రాజులు 24:4

అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను.

2రాజులు 24:5

యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు జరిగించిన దాని నంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

2రాజులు 24:6

యెహోయాకీము తన పితరులతో కూడ నిద్రించగా అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజాయెను.

యెహెజ్కేలు 19:4

అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తు దేశమునకు దాని తీసికొనిపోయిరి.

యెహెజ్కేలు 12:13

అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీయుల దేశమైన బబులోనునకు వాని తెప్పించెదను, అయితే ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును

యెహెజ్కేలు 17:20

అతని పట్టుకొనుటకై నేను వలనొగ్గి యతని చిక్కించుకొని బబులోనుపురమునకు అతని తీసికొనిపోయి, నామీద అతడు చేసియున్న విశ్వాస ఘాతకమునుబట్టి అక్కడనే అతనితో వ్యాజ్యెమాడుదును.

విలాపవాక్యములు 4:20

మాకు నాసికారంధ్రముల ఊపిరివంటివాడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను.

2రాజులు 24:2

యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.