లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 23: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది కాముకురాలి రీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 23:12

ప్రశస్త వస్త్రములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల యౌవనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహించెను.

యెహెజ్కేలు 23:13

అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను.

యెహెజ్కేలు 23:14

మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలు గలవారై

యెహెజ్కేలు 23:15

సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీయుల పటములను చూచి మోహించెను.

ఆదికాండము 39:7

అటుతరువాత అతని యజమానుని భార్య యోసేపుమీద కన్నువేసి తనతో శయనించుమని చెప్పెను

యెహెజ్కేలు 23:23

గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించుచున్నాను.

ప్రకటన 9:16

గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువది కోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.