యెహెజ్కేలు 29: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" నరపుత్రుడా, తూరు పట్టణముమీద బబులోనురాజైన నెబుకద్రెజరు తన సైన్యముచేత బహు ఆయాసకరమైన పని చేయించెను, వారందరి తలలు బోడివాయెను, అందరి భుజములు కొట్టుకొనిపోయెను; అయినను తూరు పట్టణముమీద అతడు చేసిన కష్టమునుబట్టి అతనికైనను, అతని సైన్యమునకైనను కూలి యెంత మాత్రమును దొరకకపోయెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును
ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.
ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవాయొద్ద విచారణ చేయుటకై నాయొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా
తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
పదకొండవ సంవత్సరము మొదటినెల యేడవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
మరియు పండ్రెండవ సంవత్సరము పండ్రెండవ నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొనిపోయెను.