యెహెజ్కేలు 33: 4
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గమువచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది"
సంబంధిత రిఫరెన్స్‌లు
దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయనియెడల ఆ దుర్మార్గుడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని అతని ప్రాణమునుగూర్చి నిన్ను విచారణ చేయుదును.
అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువనియెడల అతడు తన దోషమునుబట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు.
మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.
గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.
తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము
యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశములో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి, ఎట్లనగా ప్రాకారముగల పట్టణములలోనికి పోవునట్లుగా పోగై రండి.
బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.
దేశములో ధ్వజములనెత్తుడి జనములలో బాకానాదము చేయుడి దానిమీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి దానిమీద పడుటకై అరారాతు మిన్నీ అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి దానిమీదికి జనులను నడిపించుటకై సేనాధిపతిని నియమించుడి రోమముగల గొంగళిపురుగులంత విస్తారముగా గుఱ్ఱములను దానిమీదికి రప్పించుడి.
బాకా నీ నోటను ఉంచి ఊదుము, జనులు నా నిబంధన నతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరియున్నారు గనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము.
సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరికనాదము చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురు గాక.
ఐగుప్తు దేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబము వారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.
అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.
సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా?ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా?
ఏమియు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?
భూమిమీద ఒకడును ఎర పెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలి లేచునా?
పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.
సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?
అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి; ఎట్లనగా--మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.
వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.
కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును.
యెహోవా సెలవిచ్చునదేమనగా గొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.
ప్రభువును దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా--నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియజేయుడి.
ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.
చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.
సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్యజనమునకు పెద్దలైనవారికి శ్రమ
కల్నేకు పోయి విచారించుడి; అక్కడనుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.
ఉపద్రవదినము బహుదూరమున నున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీమధ్య మీరు పీఠములు స్థాపింతురు.
దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱపిల్లలను సాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు.
స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు.
పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళతైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.
కాబట్టి చెరలోనికి ముందుగా పోవువారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము; వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని
ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.
ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.
ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడు ఇంకెవరును లేరనును; అంతట దాయా దిట్లనును నీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవా నామము స్మరించకూడదు;
ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు
గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,
న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతిఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి.
ఇందుకు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, నేను మీమీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు.
విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము: మనమందరము జ్ఞానము గలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును.
ఒకడు తనకేమైనను తెలియుననుకొనియుంటే, తాను తెలిసికొనవలసినట్టు ఇంకను ఏమియు తెలిసికొనినవాడు కాడు.
ఒకడు దేవుని ప్రేమించినయెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.
కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము : లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము.
దేవతలనబడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
అయితే అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు;
భోజనమునుబట్టి దేవుని యెదుట మనము మెప్పుపొందము; తినకపోయినందున మనకు తక్కువలేదు, తినినందున మనకు ఎక్కువలేదు.
అయినను మీకు కలిగియున్న యీ స్వాతంత్ర్యమువలన బలహీనులకు అభ్యంతరము కలుగకుండ చూచుకొనుడి.
ఏలయనగా జ్ఞానముగల నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల, బలహీనమైన మనస్సాక్షిగల అతడు విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?
అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.
ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుటవలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుటవలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు.
కాబట్టి భోజనపదార్థమువలన నా సహోదరునికి అభ్యంతరము కలిగినయెడల, నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికిని మాంసము తినను.
మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చునప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును?
మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.
అయినను వారు అవిధేయులై నీమీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.
వాటివలన నీ సేవకుడు హెచ్చరికనొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్యమిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.
పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?
అతడు పరిసయ్యులలోను, సద్దూకయ్యులలోను, అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలము ఫలించుడి
బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.
బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము.
సహోదరులారా, మేము మీకు బోధించునది ఏమనగా అక్రమముగా నడుచుకొనువారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడినవారిని దైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి, అందరియెడల దీర్ఘశాంతము గలవారై యుండుడి.