యెహెజ్కేలు 34: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చెదను, గాయపడినదానికి కట్టు కట్టుదును, దుర్బలముగా ఉన్నదానిని బలపరచుదును; అయితే క్రొవ్వినవాటికిని బలముగలవాటికిని శిక్షయను మేతపెట్టి లయపరచెదను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును.
ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును.
ప్రాకారముగల పట్టణము నిర్జనమై అడవివలె విడువబడును విసర్జింపబడిన నివాసస్థలముగా నుండును అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్లకొమ్మలను తినును.
యాకోబునుండి సంతానమును యూదానుండి నా పర్వతములను స్వాధీనపరచుకొనువారిని పుట్టించెదను నేను ఏర్పరచుకొనినవారు దాని స్వతంత్రించుకొందురు నా సేవకులు అక్కడ నివసించెదరు.
నన్నుగూర్చి విచారణచేసిన నా ప్రజలనిమిత్తము షారోను గొఱ్ఱల మేతభూమియగును ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును.
నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు.
ఆ దినమున నేను నా జనుల పక్షముగా భూజంతువులతోను ఆకాశపక్షులతోను నేలను ప్రాకు జంతువులతోను నిబంధన చేయుదును. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండ మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదును.
ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయము లేకుండ విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు;
వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యెహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు నా గొఱ్ఱ పిల్లలను మేపుమని అతనితో చెప్పెను.
అతడు నాయొద్ద నున్న పిల్లలు పసిపిల్లలనియు, గొఱ్ఱలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియు నా ప్రభువుకు తెలియును. ఒక్కదినమే వాటిని వడిగా తోలినయెడల ఈ మంద అంతయు చచ్చును.
ఇశ్రాయేలీయులతోకూడ నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరమొకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెన్నడైనను అనియుంటినా?
ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.
పండుకొనునప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు.
తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును.