లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 37: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన నరపుత్రుడా, యెండిపోయిన యీ యెముకలు బ్రదుకగలవా? అని నన్నడుగగా ప్రభువా యెహోవా అది నీకే తెలియునని నేనంటిని."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 11:30

అవి యొర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూరవృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కనానీయుల దేశమందున్నవి గదా.

యెహెజ్కేలు 37:11

అప్పుడాయన నాతో ఇట్లనెను నరపుత్రుడా, ఈ యెముకలు ఇశ్రాయేలీయులనందరిని సూచించుచున్నవి. వారుమన యెముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతివిు అని యనుకొనుచున్నారు

కీర్తనలు 141:7

ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా యెముకలు పాతాళద్వారమున చెదరియున్నవి.

యిర్మియా 31:40

శవములును బూడిదయు వేయబడు లోయ అంతయు కిద్రోను వాగువరకును గుఱ్ఱముల గవినివరకును తూర్పుదిశనున్న పొలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితములగును. అది మరి ఎన్నడును పెల్లగింపబడదు, పడద్రోయబడదు.

ప్రకటన 20:5

ఆ వెయ్యి సంవత్సరములు గడచు వరకు కడమ మృతులు బ్రదుకలేదు; ఇదియే మొదటి పునరుత్థానము.