యెహెజ్కేలు 4: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" పట్టణము ముట్టడివేయబడినట్లుండు దినములు నీవు రెండవ ప్రక్కను తిరుగక అదేపాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు ఇనుపరేకొకటి తెచ్చి, నీకును పట్టణమునకును మధ్య ఇనుపగోడగా దానిని నిలువబెట్టి, నీ ముఖదృష్టిని పట్టణముమీద ఉంచుకొనుము; పట్టణము ముట్టడివేయబడినట్లుగా ఉండును, నీవు దానిని ముట్టడివేయువాడవుగా ఉందువు; అది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును.
నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రకటించుము
సమస్త జనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచియున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు.
నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్యమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము
నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధ స్థలములనుబట్టి ఇశ్రాయేలీయుల దేశమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము
అతడు తన రాజ్యము యొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధి చేయబడును; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు, అయితే ఆమె సమ్మతింపక అతని కలిసికొనదు.