లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 4: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులనుగూర్చియు యెరూషలేము పట్టణపువారినిగూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 27:37

ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయనమీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి.

అపోస్తలులకార్యములు 24:5

ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,

అపోస్తలులకార్యములు 24:6

మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.

అపోస్తలులకార్యములు 24:7

తమరు విమర్శించినయెడల

అపోస్తలులకార్యములు 24:8

మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.

అపోస్తలులకార్యములు 24:9

యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.

అపోస్తలులకార్యములు 24:13

మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.

అపోస్తలులకార్యములు 25:7

పౌలు వచ్చినప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేకపోయిరి.

ప్రకటన 12:10

మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్లు మన దేవుని యెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడియున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవునివాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.

ఆదికాండము 26:21

వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను.

ఎస్తేరు 1:1

అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము; హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరువది యేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.

దానియేలు 11:2

ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తుచేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును.