లేఖనాలను అన్వేషించండి

గలతీయులకు 4: 3

క్రాస్-రిఫరెన్స్‌లు

" అటువలె మనమును బాలురమై యున్నప్పుడు లోకసంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమైయుంటిమి;"

సంబంధిత రిఫరెన్స్‌లు

దానియేలు 11:29

నిర్ణయకాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదట నున్నట్టుగా కడపటనుండదు.

హబక్కూకు 2:3

ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.

యోహాను 15:7

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.

గలతీయులకు 3:24

కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను.

గలతీయులకు 4:7

కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు.