లేఖనాలను అన్వేషించండి

హెబ్రీయులకు 6: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఒకసారి వెలిగింపబడి, పరలోక సంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై"

సంబంధిత రిఫరెన్స్‌లు

అపోస్తలులకార్యములు 18:21

అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగివత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.

రోమీయులకు 15:32

మీరు నాకొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని, మన ప్రభువైన యేసుక్రీస్తునుబట్టియు, ఆత్మవలని ప్రేమనుబట్టియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

1కొరిందీయులకు 4:19

ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.

1కొరిందీయులకు 16:7

ప్రభువు సెలవైతే మీయొద్ద కొంతకాలముండ నిరీక్షించుచున్నాను

యాకోబు 4:15

కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రదికియుండి ఇది అదిచేతమని చెప్పుకొనవలెను.