లేఖనాలను అన్వేషించండి

హోషేయ 4: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి జనులకు ఏలాగో యాజకులకును ఆలాగే సంభవించును; వారి ప్రవర్తననుబట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారముచేతును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 6:26

పాపపరిహారార్థబలిగా దానినర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.

లేవీయకాండము 7:6

అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.

లేవీయకాండము 7:7

పాపపరిహారార్థబలిని గూర్చిగాని అపరాధపరిహారార్థబలిని గూర్చిగాని విధి యొక్కటే. ఆ బలిద్రవ్యము దానివలన ప్రాయశ్చిత్తము చేయు యాజకునిదగును.

1సమూయేలు 2:29

నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.

కీర్తనలు 24:4

వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగియుండువాడే.

కీర్తనలు 25:1

యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను.

యెషయా 56:11

కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తిలేదు. ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరు తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండ అందరు స్వప్రయోజనమే విచారించుకొందురు.

యెహెజ్కేలు 14:3

నరపుత్రుడా, యీ మనుష్యులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమయెదుటనే పెట్టుకొనియున్నారు, వీరు నాయొద్ద ఏమైన విచారణచేయదగునా?

యెహెజ్కేలు 14:7

ఇశ్రాయేలీయులలోను వారి దేశములో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసికొని అభ్యంతరమును తమయెదుట పెట్టుకొని తమ నిమిత్తమై నాయొద్ద విచారణచేయవలెనని ప్రవక్తయొద్దకు వచ్చినయెడల యెహోవానగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరమిచ్చెదను.

మీకా 3:11

జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు; అయినను వారు, యెహోవాను ఆధారము చేసికొని యెహోవా మన మధ్యనున్నాడు గదా, యే కీడును మనకు రానేరదని యనుకొందురు.

మలాకీ 1:10

మీలో ఒకడు నా బలిపీఠముమీద నిరర్థకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండినయెడల మేలు; మీయందు నాకిష్టములేదు, మీచేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

రోమీయులకు 16:18

అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు; వారు ఇంపైన మాటలవలనను ఇచ్చకములవలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు.

తీతుకు 1:11

వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడనివాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.

2పేతురు 2:3

వారు అధిక లోభులై, కల్పనా వాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వమునుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.

లేవీయకాండము 5:13

పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్యశేషమువలె యాజకునిదగును.

న్యాయాధిపతులు 18:4

అతడు మీకా తనకు చేసిన విధముచెప్పిమీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై యున్నా నని వారితో చెప్పెను.

2రాజులు 12:16

అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.

2దినవృత్తాంతములు 11:16

వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయందంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.

సామెతలు 19:28

వ్యర్థుడైన సాక్షి న్యాయము నపహసించును భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును.

యిర్మియా 5:23

ఈ జనులు తిరుగుబాటును ద్రోహమునుచేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటుచేయుచు తొలగిపోవుచున్నారు.

ఆమోసు 2:8

తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.

యోహాను 15:5

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

అపోస్తలులకార్యములు 19:25

అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగుచున్నదని మీకు తెలియును.

1కొరిందీయులకు 13:6

దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.