హోషేయ 8: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్షచెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.
వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును.
ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్లచెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరుగును, పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు, కొండలను చూచి మామీద పడుడనియు వారు చెప్పుదురు.
నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నిన చేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి
విగ్రహములను పూజించు రాజ్యములు నాచేతికి చిక్కినవి గదా? వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహములకంటె ఎక్కువైనవి గదా?
షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా అనెను.
అక్కడ మీరు మనుష్యుల చేతిపనియైన కఱ్ఱ రాతిదేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు.
కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీ పితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.
అహరోను అది చూచి దాని యెదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా
అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా ఆ దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, ఆ కొండనుండి పారు ఏటిలో ఆ ధూళిని పారపోసితిని.
మీకు మీరు పాపము కలుగజేసికొని మీచేతులతో మీరు నిర్మించిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఆ దినమున మీలో ప్రతివాడును పారవేయును.
ఎఫ్రాయిమును నేనెరుగుదును; ఇశ్రాయేలు వారు నాకు మరుగైనవారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు; ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి.