లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 28: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆలాగున జరుగునుగాక, యెహోవా ఆలాగుననే చేయునుగాక, యెహోవా మందిరపు ఉపకరణములన్నిటిని, చెరగొనిపోబడిన వారినందరిని యెహోవా బబులోనులోనుండి ఈ స్థలమునకు తెప్పించి నీవు ప్రకటించిన మాటలను నెరవేర్చునుగాక."

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 28:1

యూదా రాజైన సిద్కియా యేలుబడి ఆరంభమున నాల్గవ సంవత్సరము అయిదవ నెలలో గిబియోనువాడును ప్రవక్తయును అజ్జూరు కుమారుడునైన హనన్యా యాజకుల యెదుటను ప్రజలందరియెదుటను యెహోవా మందిరములో నాతో ఈలాగనెను

యిర్మియా 7:2

నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము యెహోవాకు నమస్కారము చేయుటకై యీ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.

యిర్మియా 19:14

ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.

యిర్మియా 26:2

యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, నీవు యెహోవా మందిరావరణములో నిలిచి, నేను నీ కాజ్ఞాపించు మాటలన్నిటిని యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికి ప్రకటింపుము; వాటిలో ఒక మాటైనను చెప్పక విడవకూడదు.