యిర్మియా 44: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తు దేశవాసము చేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ దినమున కనాను భాషతో మాటలాడుచు యెహోవా వారమని ప్రమాణముచేయు అయిదు పట్టణములు ఐగుప్తుదేశములో ఉండును, వాటిలో ఒకటి నాశనపురము.
ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగిపోవును.
ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, ఐగుప్తు దేశమందలి మనుష్యులలోనేగాని జంతువులలోనేగాని తొలి సంతతి యంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.
ఆషాను దాని గ్రామములు, బేత్షెమెషు దాని గ్రామములు.
మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగా నున్నవి అవి క్రుంగుచు కూలుచునుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి పోయియున్నవి.
ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నోలోనుండు ఆమోను దేవతను ఫరోను ఐగుప్తును దాని దేవతలను దాని రాజులను ఫరోను అతని నాశ్రయించువారిని నేను దండించుచున్నాను.
జనములలో ప్రకటించుడి సమాచారము తెలియజేయుడి ధ్వజమునెత్తి మరుగుచేయక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నొందును మెరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నొందును దాని బొమ్మలు బోర్లద్రోయబడును
అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును.
మీ బలిపీఠములు పాడైపోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తు దేశములో అధిపతిగా ఉండుటకెవడును లేకపోవును, ఐగుప్తు దేశములో భయము పుట్టించెదను.
మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును. అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపు రాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును.
అది ఇశ్రాయేలువారిచేతిపనియే గదా? కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు గదా; షోమ్రోను చేసికొనిన యీ దూడ ఛిన్నాభిన్నములగును.
వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవా వారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్టించిన దేవతాస్తంభములను పాడుచేయును.
ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలువారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.