లేఖనాలను అన్వేషించండి

యిర్మియా 48: 36

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు సంపాదించినదానిలో శేషించినది నశించిపోయెను మోయాబునుగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె నాదము చేయుచున్నది కీర్హరెశు వారినిగూర్చి నా గుండె పిల్లనగ్రోవివలె వాగుచున్నది. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యిర్మియా 48:7

నీవు నీ క్రియలను ఆశ్రయించితివి నీ నిధులను నమ్ముకొంటివి నీవును పట్టుకొనబడెదవు, కెమోషు దేవత చెరలోనికిపోవును ఒకడు తప్పకుండ వాని యాజకులును అధిపతులును చెరలోనికి పోవుదురు.

సంఖ్యాకాండము 22:40

బాలాకు ఎడ్లను గొఱ్ఱలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతనియొద్దనున్న అధికారులకును పంపెను.

సంఖ్యాకాండము 22:41

మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నత స్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.

సంఖ్యాకాండము 28:14

వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.

సంఖ్యాకాండము 28:28

నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

సంఖ్యాకాండము 28:29

ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

సంఖ్యాకాండము 28:30

మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.

యెషయా 15:2

ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడియున్నది

యెషయా 16:12

మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించునప్పుడు వారికేమియు దొరకకపోవును.

యిర్మియా 48:2

హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చేయనుద్దేశించుచున్నారు మద్మేనా, నీవును ఏమియు చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది.