లేఖనాలను అన్వేషించండి

న్యాయాధిపతులు 14: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు ఆ తేనెచేత నుంచుకొని తినుచు వెళ్లుచు తన తలిదండ్రులయొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

1సమూయేలు 14:25

జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను.

1సమూయేలు 14:26

జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు.

1సమూయేలు 14:27

అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.

1సమూయేలు 14:28

జనులలో ఒకడు నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.

1సమూయేలు 14:29

అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి

1సమూయేలు 14:30

జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనము చేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.

సామెతలు 25:15

దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.

కీర్తనలు 81:16

అతిశ్రేష్ఠమైన గోధుమల ననుగ్రహించి నేను వారిని పోషించుదును కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదును.

సామెతలు 25:16

తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము అధికముగా త్రాగినయెడల కక్కివేయుదువేమో