నెహెమ్యా 3: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారమునుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును,
హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.
మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేళ్లనుబట్టి బర్జిల్లయి అని పిలువబడినవాని వంశస్థులు.
అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.
అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయువారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.
హారిము మెరేమోతు ఓబద్యా