లేఖనాలను అన్వేషించండి

సామెతలు 10: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 6:6

సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.

సామెతలు 6:8

అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.

సామెతలు 30:25

చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.

యెషయా 55:6

యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి.

యెషయా 55:7

భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యెహోవావైపు తిరిగినయెడల ఆయన వారియందు జాలిపడును వారు మన దేవునివైపు తిరిగినయెడల ఆయన బహుగా క్షమించును.

సామెతలు 12:4

యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.

సామెతలు 17:2

బుద్ధిగల దాసుడు సిగ్గుతెచ్చు కుమారునిమీద ఏలుబడి చేయును అన్నదమ్ములతోపాటు వాడు పిత్రార్జితము పంచుకొనును.

సామెతలు 19:26

తండ్రికి కీడుచేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు.

సామెతలు 14:35

బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు అవమానకరముగా నడచువానిమీద రాజు కోపించును

సామెతలు 19:15

సోమరితనము గాఢనిద్రలో పడవేయును సోమరివాడు పస్తు పడియుండును.

సామెతలు 27:25

ఎండిన గడ్డి వామి వేయబడెను పచ్చిక కనబడుచున్నది కొండగడ్డి యేరబడియున్నది

సామెతలు 29:15

బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.

యిర్మియా 8:20

కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు.