సామెతలు 11: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును."
సంబంధిత రిఫరెన్స్‌లు
దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,
తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునో యని చెప్పుకొనువారలారా,
దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షలనిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదినమెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.
నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని
యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి.
వారు నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మామీద నుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.
నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును.
నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పువానిని ప్రజలు శపించుదురు జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.
బీదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును.
దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు.
మరియు మీయెడల దేవుడు కనుపరచిన అత్యధికమైన కృపను చూచి, వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయుచు, మిమ్మును చూడవలెనని ఎక్కువ కోరికగలవారై యున్నారు.