సామెతలు 18: 1
క్రాస్-రిఫరెన్స్‌లు
" వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక"
సంబంధిత రిఫరెన్స్‌లు
జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
మీరు కేవలము మౌనముగా నుండుట మేలు అది మీకు జ్ఞానమని యెంచబడును.
విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును.
బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును.
కలుగబోవునది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు; నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో యెవరు తెలియజేతురు?
కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోవుట చూచి నేను ఊరకుందునా?
విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
నోటిని నాలుకను భద్రము చేసికొనువాడు శ్రమలనుండి తన ప్రాణమును కాపాడుకొనును.
నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీచేతితో నోరు మూసికొనుము.