సామెతలు 31: 12
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
కాగా ఆమె తన పెనిమిటిని చూచి మనయొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును.
కావున మనము అతనికి గోడమీద ఒక చిన్నగది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట దీపస్తంభము నుంచుదము; అతడు మనయొద్దకు వచ్చునప్పుడెల్ల అందులో బస చేయవచ్చునని చెప్పెను.
ఒక పనివానిని ఒక గాడిదను నాయొద్దకు పంపుము;నేను దైవజనుని యొద్దకు పోయివచ్చెదనని తన పెనిమిటితో ఆమె యనగా
అతడు నేడు అమావాస్య కాదే; విశ్రాంతిదినము కాదే; అతనియొద్దకు ఎందుకు పోవుదువని యడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి
అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి;
అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన రాబట్టబడవచ్చును.
జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక,
సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.
అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడి యుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి.
ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరక యున్నయెడల ఆమెకు పిల్లలగుదురు.
అటువలెనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైయున్నారని యెరిగి, యెక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి
అతడు తనకు కలిగినదంతయు యోసేపుచేతికప్పగించి, తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించినవాడు కాడు. యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండెను
మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి