కీర్తనలు 104: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యునికి తన అస్తమయకాలము తెలియును"
సంబంధిత రిఫరెన్స్‌లు
అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలా పర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను.
అడవిలోని కొండమేకలు ఈను కాలము నీకు తెలియునా? లేళ్లు పిల్లలు వేయు కాలమును గ్రహింపగలవా?
నెమరువేయువాటిలోనిదే కాని రెండు డెక్కలుగలవాటిలోనిదే కాని నెమరువేసి ఒంటిడెక్కగల ఒంటె, కుందేలు, పొట్టి కుందేలు అనువాటిని తినకూడదు. అవి మీకు హేయములు.
చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.
దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆ ప్రకారమాయెను.
పొట్టి కుందేలు నెమరువేయును గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.