కీర్తనలు 107: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" మత్తులైన వారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి. "
సంబంధిత రిఫరెన్స్‌లు
నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
వ్యసనమువలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యముచేత నన్ను స్థిరపరచుము.
నీ తండ్రి మహా బలాఢ్యుడనియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు గనుక సింహపుగుండెవంటి గుండెగలవారు సయితము దిగులొందుదురు.
అందుచేత బాహువులన్నియు దుర్బలములగును ప్రతివాని గుండె కరగిపోవును
అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.
వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి
దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదు దానికి నెమ్మదిలేదు.