లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 118: 8

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 54:4

ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు

కీర్తనలు 55:18

నా శత్రువులు అనేకులైయున్నారు అయినను వారు నామీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించియున్నాడు.

1దినవృత్తాంతములు 12:18

అప్పుడు ముప్పదిమందికి అధిపతియైన అమాశై ఆత్మవశుడై దావీదూ, మేము నీవారము; యెష్షయి కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము; నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక,నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను.

కీర్తనలు 54:7

ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది.

కీర్తనలు 59:10

నా దేవుడు తన కృపలో నన్ను కలిసికొనెను నాకొరకు పొంచియున్నవారికి సంభవించినదానిని దేవుడు నాకు చూపించును.

కీర్తనలు 92:11

నాకొరకు పొంచినవారి గతి నాకన్నులు ఆశతీర చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను

కీర్తనలు 112:8

వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరువరకు వాడు భయపడడు.

ఎస్తేరు 9:15

షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.

కీర్తనలు 18:17

బలవంతులగు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటె బలిష్టులైయుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

కీర్తనలు 124:1

మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల

హెబ్రీయులకు 13:6

కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.