కీర్తనలు 132: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక."
సంబంధిత రిఫరెన్స్‌లు
దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారిపోవుదురు గాక.
ఆ మందసము సాగినప్పుడు మోషే యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురు గాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురు గాక యనెను.
అది నిలిచినప్పుడు అతడు యెహోవా, ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను.
నా దేవా, యెహోవా, బలమునకాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.
దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాజ్ముఖుడవై యుండకుము,నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.
ఆయన తన బలమును చెరకును, తన భూషణమైనదానిని విరోధులచేతికిని అప్పగించెను.
వారు యెహోవా మందసమును తీసికొనివచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.
నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవకొరకు దావీదు నియమించినవారు వీరే.
ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొనివచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.
మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.
గుమ్మములారా, మీ తలలు పైకెత్తికొనుడి మహిమగల రాజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపులారా, మిమ్మును లేవనెత్తికొనుడి.
యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి
ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమస్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను
ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.