లేఖనాలను అన్వేషించండి

కీర్తనలు 35: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 7:12

ఒకడును మళ్లనియెడల, ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు

కీర్తనలు 7:13

వానికొరకు మరణసాధనములను సిద్ధపరచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు

నిర్గమకాండము 15:3

యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు.

ద్వితియోపదేశాకాండము 32:41

నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.

ద్వితియోపదేశాకాండము 32:42

చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును శత్రువులలో వీరుల తలలను నా ఖడ్గము భక్షించును నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.

యెషయా 13:5

సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశమునుండి ఆకాశ దిగంతములనుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు.

యెషయా 42:13

యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.

2సమూయేలు 22:31

దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.

కీర్తనలు 18:37

నా శత్రువులను తరిమిపట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.

యిర్మియా 11:20

నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించువాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము.