కీర్తనలు 44: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు"
సంబంధిత రిఫరెన్స్‌లు
కొందరు రథములనుబట్టియు కొందరు గుఱ్ఱములనుబట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమునుబట్టి అతిశయపడుదము.
ఏ రాజును సేనాబలముచేత రక్షింపబడడు ఏ వీరుడును అధికబలముచేత తప్పించుకొనడు.
రక్షించుటకు గుఱ్ఱము అక్కరకు రాదు అది దాని విశేషబలముచేత మనుష్యులను తప్పింపజాలదు.
అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును.
ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలికనొందిరి.
దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.
అప్పుడు యెహోవా కత్తిచేతను ఈటెచేతను రక్షించువాడు కాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మాచేతికి అప్పగించునని చెప్పెను.
అతడు నీవు వీరిని కొట్టవద్దు; నీ కత్తిచేతను నీ వింటిచేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానునియొద్దకు వెళ్లుదురని చెప్పెను.
అప్పుడు నీ దక్షిణహస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్నుగూర్చి ఒప్పుకొనెదను.
నీ సహాయమువలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయమువలన ప్రాకారమును దాటుదును.