ప్రకటన 10: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" నేను ఆ దూతయొద్దకు వెళ్లి ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన దాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.
మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.
నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరుతెరచి నేనిచ్చుదాని భుజించుము అనెను.
నేను మరల తేరిచూడగా ఎగిరిపోవు పుస్తకమొకటి నాకు కనబడెను.
రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను
విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.
మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి, యేడు ముద్రలు గట్టిగా వేసియున్న యొక గ్రంథము సింహాసనమునందు ఆసీసుడై యుండువాని కుడిచేత చూచితిని.
ఆయనచేతిలో విప్పబడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,
అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.