లేఖనాలను అన్వేషించండి

జెకర్యా 4: 14

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు వీరిద్దరు సర్వలోకనాధుడగు యెహోవాయొద్ద నిలువబడుచు తైలము పోయువారై యున్నారనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

జెకర్యా 4:5

నాతో మాటలాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా యని నన్నడుగగా నేను--నా యేలినవాడా, నాకు తెలియదంటిని.

హెబ్రీయులకు 5:11

ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము.

హెబ్రీయులకు 5:12

కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు.