1సమూయేలు 6: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడిమోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి"
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు దేవుని మందసమును క్రొత్త బండిమీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబుయొక్క యింటిలోనుండి తీసికొనిరాగా అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.
వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.
యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొనిరావలెనని వారితో చెప్పుము.
కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.
ఏడవమారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.