లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 20: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచి యోవాబును ఇష్టులైన దావీదు పక్షమున నున్నవారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 20:6

దావీదు అబీషైని పిలువనంపి బిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడు చేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను.

2సమూయేలు 20:7

కాబట్టి యోవాబు వారును కెరేతీయులును పెలేతీయులును బలాఢ్యులందరును అతనితో కూడ యెరూషలేములోనుండి బయలుదేరి బిక్రి కుమారుడగు షెబను తరుమబోయిరి.

2సమూయేలు 20:13

శవము మార్గమునుండి తీయబడిన తరువాత జనులందరు బిక్రి కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి.

2సమూయేలు 20:21

బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పి పోయి

2సమూయేలు 20:4

తరువాత రాజు అమాశాను పిలువనంపి మూడు దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరిని సమకూర్చి యిక్కడ హాజరుకమ్మని ఆజ్ఞాపించగా

2రాజులు 9:32

అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి నా పక్షమందున్నవారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.

నిర్గమకాండము 32:26

అందుకు మోషే పాళెముయొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్నవారందరు నాయొద్దకు రండి అనగా లేవీయులందరును అతని యొద్దకు కూడి వచ్చిరి.