2సమూయేలు 20: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" అమాశా యూదావారిని సమకూర్చుటకై వెళ్లిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు"
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు అమాశాయొద్దకు దూతలను పంపినీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.
సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తనయొద్దనుండి చెదరిపోవుటయు చూచి
ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయము చేసికొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.
వారు గిబియోనులో ఉన్న పెద్ద బండదగ్గరకు రాగా అమాశా వారిని కలియవచ్చెను; యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొనియుండగా ఆ వర వదులై కత్తి నేలపడెను.